టెంపా: ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) ఈ సారి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 'భాషే రమ్యం.. సేవే గమ్యం' అనే నినాదంతో తన సేవాపథంలో భాగంగా టెంపాలో క్యాన్డ్‌ఫుడ్ డ్రైవ్ నిర్వహించింది. అన్నార్థుల ఆకలి తీర్చే లక్ష్యంతో చేపట్టిన ఈ ఫుడ్ డ్రైవ్‌కు స్థానిక తెలుగువారి నుంచి విశేష స్పందన లభించింది. రెండు వారాల సమయంలోనే 1000ఎల్‌బీల ఫుడ్ క్యాన్స్‌ను తెలుగువారు విరాళంగా అందించారు. విరాళాల రూపంలో సేకరించిన ఫుడ్ క్యాన్స్‌ను స్థానిక ఫీడింగ్ అమెరికా టెంపా డౌన్ టౌన్‌కు నాట్స్ నాయకత్వ బృందం అందించింది. పేదలకు ఉచితంగా ఫీడింగ్ టెంపాబే సంస్థ ఆహారాన్ని అందిస్తుంది. నాట్స్ చేపట్టిన ఈ ఫుడ్ డ్రైవ్‌పై ఫీడింగ్ టెంపాబే సంస్థ ప్రశంసల వర్షం కురిపించింది.