అమెరికాలో తెలుగువిద్యార్థిపై కాల్పులు

అమెరికాలో మరో తెలుగువిద్యార్థిపై దుండగులు కాల్పులకు  తెగబడ్డారు. మహబూబాబాద్‌కు చెందిన పూస సాయికృష్ణ  మిచిగాన్‌ రాష్ట్రంలోని లారెన్స్‌ టెక్‌ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ చేస్తున్నారు. స్థానిక రెస్టారెంట్‌లో పార్శిల్‌ తీసుకొని వస్తుండగా సాయికృష్ణపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సాయికృష్ణ కుడిచేతి, మెడపై బుల్లెట్ గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. కాల్పుల అనంతరం సాయికృష్ణ వద్ద ఉన్న నగదు, కారు, గుర్తింపు పత్రాలను దుండగులు దోచుకెళ్లారు. ఈ ఘటన ఈనెల 3న జరిగినట్టు తెలుస్తోంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Read also in:
Back to Top