వెయిట్ లాస్ కోసమే చంద్రబాబు నాయుడు దీక్ష చేస్తున్నారని, ఆయనకు డేరా బాబాకు ఏం తేడా లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి మండిపడ్డారు. చంద్రబాబు చేస్తున్న దొంగ దీక్షను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కేవలం వాళ్ల ఉనికి కాపాడుకోవడం కోసమే ఆయన తన కుమారుడితో కలిసి పనికిమాలిన దీక్షను చేపట్టారని ఆరోపించారు.