వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ముగింపు సభ చరిత్రలో నిలిచి పోయే విధంగా ఈనెల 9న ఇచ్చాపురంలో జరగనుందని వైఎస్సార్‌సీపీ రీజినల్ కోఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు అన్నారు. గతంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర వల్ల ఎటువంటి మార్పు రాష్ట్రంలో వచ్చిందో మళ్లీ వైఎస్ జగన్ పాద యాత్రతో అటువంటి మార్పే వస్తుందని తెలిపారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను పూర్తి చేశామని సీఎం చంద్రబాబు నాయుడు ధైర్యంగా చెప్పగలరా అని ప్రశ్నించారు. తనకుతానుగా గొప్పవాడు అని చెప్పుకునే వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. సింగపూర్ కంపెనీలతో పెట్టుకున్న అగ్రి మెంటులను పబ్లిక్ డొమైన్‌లో పెట్టగలరా అని నిప్పులు చెరిగారు.