పథకం ప్రకారమే దాడి - డీజీపి | YSRCP chief Jaganmohan Reddy stabbed on the arm at Vizag Airport | Sakshi
Sakshi News home page

పథకం ప్రకారమే దాడి - డీజీపి

Oct 25 2018 2:41 PM | Updated on Mar 20 2024 3:51 PM

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై  విశాఖపట్టణం ఎయిర్‌పోర్టులో గురువారం జరిగిన హత్యాయత్నం కలకలం సృష్టించింది. దీంతో  తెలుగు రాష్ట్రాల్లోని వైసీపీ  నాయకులు, శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే ఈ ఘటనపై పొలీసు అధికారులు స్పందించారు. జగన్‌కు అత్యంత సన్నిహితంగా వెళ్లి మరీ  నిందితుడు శ్రీనివాస్‌ పథకం ప్రకారం ఎటాక్‌ చేశాడని డీజీపి ఆర్‌పీ ఠాకూర్‌ పక్రటించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ జేబులో ఒక లెటర్‌ను (ఎనిమిది పేజీల) కూడా కనుగొన్నామని చెప్పారు. దీన్ని సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది తమకు అందించారని తెలిపారు. ఈ దాడికి సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందిదే పూర్తి బాధ్యత అని డీజీపీ పేర్కొన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement