అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు ఏమాత్రం తలొగ‍్గలేదు | YSRCP Bapatla MP Nandigam Suresh Shares His Political Entry | Sakshi
Sakshi News home page

అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు ఏమాత్రం తలొగ‍్గలేదు

May 25 2019 6:08 PM | Updated on Mar 21 2024 8:18 PM

అతడు చావును చాలా దగ్గరగా చూశాడు. మరికొద్ది నిమిషాల్లో ఇక తన ప్రాణాలు గాల్లో కలవడం ఖాయం అని కూడా ఫిక్స్‌ అయిపోయాడు. రాజధాని ప్రాంతంలో అరటి తోటలను తగలబెట్టిన సమయంలో టీడీపీ నేతల ఆదేశాలతో అతడిని పోలీసులు చిత్రహింసలకు గురిచేశారు. అయినప్పటికీ మనస్సాక్షికి కట్టుబడ్డాడు. ఎన్‌కౌంటర్‌ చేస్తామని, రైల్వే పట్టాలపై పడుకోబెడతామని... చంపేసి తన భార్యతో ఊడిగం చేయించుకుంటామని హింసించారు. జగన్‌ పేరు చెబితే వదిలేస్తామంటూ బేరసారాలకు దిగారు. అయినా అందుకు ఒప్పుకోకపోవడంతో మూడురోజుల పాటు చిత్రహింసలు పెట్టారు. తోటను తగలబెట్టడంలో వైఎస్సార్‌ సీపీ ప్రమేయం ఉందని పోలీసులు చెప్పించే యత్నం చేసినా సురేష్‌ మాత్రం భయపడకుండా నిజం చెప్పారు తప్ప, ఎటువంటి భయాలకూ, ప్రలోభాలకూ లొంగలేదు. 

Advertisement
 
Advertisement
Advertisement