వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని వచ్చే నెల 15 నుంచి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రైతు భరోసా పథకం మార్గదర్శకాలను ఖరారు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయదారుల కుటుంబాల ఆదాయాన్ని పెంచేందుకు ఉద్దేశించిన ఈ పథకం 2019 – 20 రబీ నుంచి అమలవుతుంది. రైతు కుటుంబాలకు, భూమిలేని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కౌలు రైతుల కుటుంబాలకు ఈ పథకం కింద ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. ఈ పథకం విధివిధానాలకు సంబంధించి వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ అరుణ్‌కుమార్ సమర్పించిన లేఖను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి వాటికి ఆమోదం తెలిపింది.
అక్టోబర్ 15 నుంచి వైఎస్సార్ రైతు భరోసా
Sep 20 2019 7:50 AM | Updated on Sep 20 2019 8:03 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement