ఆత్మకూరు మండలంలోని సిద్ధాపురం చెరువు వద్ద మంగళవారం ‘వైఎస్సార్ గంగాహారతి’ కార్యక్రమాన్ని భారీఎత్తున నిర్వహించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చలువ వల్లే సిద్ధాపురం ఎత్తిపోతల పథకం పూర్తయ్యింది. దీనివల్ల వేలాది ఎకరాల భూములు సస్యశ్యామలం కానున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్ సహకారాన్ని స్మరించుకుంటూ వైఎస్సార్‌సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త శిల్పా చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో ‘వైఎస్సార్ గంగాహారతి’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆయన మూడు రోజులుగా ఆత్మకూరులోనే మకాం వేసి.. ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. అలాగే సోమవారం పార్టీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, పార్టీ నాయకులు శిల్పా కార్తీక్‌రెడ్డి, రవిచంద్ర కిశోర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, శిల్పా భువనేశ్వరరెడ్డి తదితరులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు.
శిల్పా చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ గంగాహారతి
Apr 17 2018 9:23 AM | Updated on Mar 22 2024 11:07 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement