రోడ్లు, భవనాల శాఖపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష | YS Jagan Review Conference On Roads And Buildings Department | Sakshi
Sakshi News home page

రోడ్లు, భవనాల శాఖపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష

Nov 4 2019 8:07 PM | Updated on Mar 22 2024 10:57 AM

 రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లను వెంటనే గుర్తించి యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం రోడ్లు, భవనాల శాఖపై సీఎం సమీక్షించారు. విజయవాడ కనకదుర్గ వారధిని సత్వరమే పూర్తి చేయాలన్నారు. దుర్గగుడికి వచ్చే యాత్రికుల వల్ల పనులు నిలుపుదల చేస్తున్నామని, జనవరి నెలాఖారుకు పూర్తి చేస్తామని అధికారులు సీఎంకు వివరణ ఇచ్చారు. బెంజ్‌ సర్కిల్‌ ఫ్లై ఓవర్‌కు ఇరువైపులా ఉన్న సర్వీసు రోడ్లనూ కూడా పూర్తిచేయాలని సీఎం కోరాగా, డిసెంబర్‌ నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement