తెలుగు నేలపై ఒక వర్గం మీడియా గుత్తాధిపత్యాన్ని సవాలు చేస్తూ పదేళ్ల కిందట పుట్టింది సాక్షి. నాణేనికి బొమ్మతో పాటు బొరుసు కూడా ఉంటుంది. దాన్ని కూడా జనానికి తెలియజేయాలనేదే ‘సాక్షి’ని ఆరంభించటానికి ప్రధాన కారణం. ఆనాటి చైర్మన్‌గా నా ఆలోచన అదే. సహజంగానే చాలామందికి అది నచ్చలేదు. ఫలితంగా సాక్షిని దెబ్బతీయటానికి ఎన్నెన్నో కుట్రలు జరిగాయి. అన్నిటినీ ఎదుర్కొంటూ అలుపెరుగని చరిత్రాత్మక పోరాటం సాగించింది సాక్షి.