కృష్ణా ఉగ్రరూపం.. సాగర్‌ గేట్ల ఎత్తివేత | Water Released From Nagarjuna Sagar To Pulichinthala | Sakshi
Sakshi News home page

కృష్ణా ఉగ్రరూపం.. సాగర్‌ గేట్ల ఎత్తివేత

Aug 12 2019 3:03 PM | Updated on Aug 12 2019 3:05 PM

ఎగువన కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వస్తున్న వరదతో కృష్ణానది ఉగ్రరూపం దాల్చింది. ఆల్మట్టి, నారాయణ్‌పూర్‌ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్‌ కళకళలాడుతున్నాయి. వరద ఉద్ధృతి కొనసాగుతున్నందున సోమవారం సాగర్‌లో 26 గేట్లను పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువన ఉన్న శ్రీశైలం నుంచి వరద ప్రవాహం అధికంగా ఉండటంతో నాగార్జునసాగర్‌ జలకళ సంతరించుకుంటోంది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement