పర్యాటకులపై నుంచి కొద్ది అడుగుల దూరంలోనే విమానం వెళ్లి రన్‌వేపై ల్యాండ్ అయిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బ్రిటిష్ ఏయిర్‌లైన్స్‌కు చెందిన విమానం పర్యాటకుల తలలపై నుంచి అతి తక్కువ దూరంలో వెళుతూ రన్‌వేపై ల్యాండ్ అయింది. విమానం ల్యాండ్ అయ్యే సందర్భంలో కొంతమంది పర్యాటకులు మరింత దగ్గరగా చూడటానికి గోడపైకి ఎక్కడంతో గాలివేగానికి కిందపడబోయారు. ఈ సంఘటన గ్రీస్‌లోని స్కియాథోస్ విమానాశ్రయంలో జరిగింది. ఈ విమానాశ్రయం తక్కువ ఎత్తులో ల్యాండ్ అయ్యే విమానాలకు ప్రసిద్ధి చెందింది.
పర్యాటకుల తలలపై నుంచి ల్యాండింగ్
Jul 16 2019 6:11 PM | Updated on Jul 16 2019 6:13 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement