రాజ్యసభలో ప్రైవేటు బిల్లుపై చర్చ
ఆర్థిక అంశాల్లో రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రాజ్యసభలో ‘కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో చేర్చిన రాష్ట్రాల అంశాలు తిరిగి రాష్ట్రాల జాబితాలో చేర్చాలి’ అంటూ తమిళనాడు ఎంపీ వైకో చేసిన ప్రైవేటు తీర్మానంపై చర్చ జరిగింది. దీనిపై విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ‘రాష్ట్రాలు కేంద్రం నుంచి అధికారాలను లాక్కునేందుకు ఆసక్తిగా లేవు. కేవలం ఆర్థిక అధికారాల విషయంలోనే వాటి డిమాండ్లు ఉన్నాయి. ఈ విషయంలో కేంద్రానికి ఎక్కువ అధికారాలున్నాయి. కేంద్ర పన్నుల వాటాలో రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సిన నిధులను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచామని చెబుతున్నా.. కేంద్ర ప్రాయోజిత పథకాలను ఆ మేరకు రద్దు చేసిన విషయం మరవొద్దు. కేంద్ర న్యాయమంత్రి రాష్ట్రాలకు మరిన్ని ఆర్థిక అధికారాలు ఇచ్చేలా తగిన మార్గదర్శకాలు రూపొందించాలి..’ అని కోరారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి