తూత్తుకుడి బాధితులకు విజయ్ ఆర్థిక సాయం | Vijay Visits Sterlite Protest Victim Family In Thoothukudi | Sakshi
Sakshi News home page

తూత్తుకుడి బాధితులకు విజయ్ ఆర్థిక సాయం

Jun 6 2018 12:05 PM | Updated on Mar 21 2024 5:17 PM

తమిళనాట ప్రకంపనలు సృష్టించిన తూత్తుకుడి స్టెరిలైట్‌ ఫ్యాక్టరీ వ్యతిరేక పోరాట బాధితులకు సినీ ప్రముఖుల నుంచి మద్ధతు లభిస్తోంది. ఇప్పటికే కమల్‌ హాసన్‌, రజనీకాంత్‌ బాధితులను పరామర్శించి వారికి మద్ధతుగా నిలిచారు. విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి ఆర్థిక సాయం ప్రకటించారు.

తాజాగా కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ కూడా మృతుల కుటుంబాలను కలిసి వారికి తనవంతు ఆర్థిక సాయం అందిచారు. మంగళవారం (జూన్‌ 5) రాత్రి రహస్యంగా బైకుపై తూత్తుకుడి చేరుకున్న విజయ్‌ బాధిత కుటుంబాలకు లక్ష చొప్పున ఆర్థిక సాయం చేశారు. గ్రామంలో విజయ్‌ బైక్‌పై ప్రయాణించిన ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement