విపత్తుల వేళ ప్రభుత్వాధినేతలు కష్టాల్లో ఉన్న రైతులకు అండగా నిలవాలి. వారికి నేనున్నానని భరోసా కల్పించాలి. కానీ ఇందుకు విరుద్దంగా చంద్రబాబు చేస్తున్న ఈవెంట్ మేనేజ్‌మెంట్లు తీవ్ర విస్మయానికి గురి చేస్తున్నాయి. ఓవైపు ఏరియల్ సర్వేలంటూ హెలికాప్టర్‌లో చక్కర్లు కొడుతూ మరొకవైపు క్షేత్రస్థాయి పరిశీలన పేరిట ఆయన చేస్తున్న ప్రచారార్భాటాలను చూసి రైతులు నివ్వెరపోతున్నారు. ‘అర్నబ్’ తుపాను వేళ డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ, గోదావరి జిల్లాల్లోనూ... ‘మురసు’ సమయంలో బాపట్ల, గుంటూరు జిల్లాల్లో బాబు చేసిన హంగామా అంతా అంతా కాదు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను మండలం రేటూరులో మురసు తుపాను ముంపు ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం సీఎం చంద్రబాబునాయుడు పర్యటించారు. పుట్టెడు కష్టాల్లో ఉన్న రైతులను అక్కున చేర్చుకుని అండగా నిలవాల్సిన వేళ వారి గోడు పట్టించుకోకుండా ‘మీరు వీడియోలు, ఫోటోలు తీసుకోండి. మీకు ఎలా కావాలంటే అలా ఫోజులిస్తా’ అంటూ తన వెంట తీసుకెళ్లిన ఈవెంట్ మేనేజ్‌మెంట్ (ఫోటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లకు) నిర్వాహకులకు బాబు స్వయంగా సూచనలు ఇవ్వడం రైతులను విస్తుపోయేలా చేశాయి. కాళ్లకు కాదు కదా.. కనీసం బూట్లకు కూడా మట్టి అంటకుండా పొలం గట్లపై నడుస్తూ, రైతులను పంట బోదెల్లో దింపి వారి భుజాలపై చేతులేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇన్‌పుట్ సబ్సిడీ రావడం లేదు.. పంటల బీమా పరిహారం రావడం లేదంటూ కౌలురైతులు నిలదీస్తే బదులివ్వాల్సింది పోయి.. ‘ప్రీమియం కట్టమంటే కౌలు రైతులు చెల్లించలేదు.. బీమా పరిహారం ఎలా వస్తుంది?’ అని చంద్రబాబు గద్దించడం తీవ్ర చర్చనీయాంశమైంది
ఈవెంట్ బాబు.. ఫోటోల డాబు!
Nov 6 2026 10:59 PM | Updated on Nov 6 2026 10:59 PM
Advertisement
Advertisement
Advertisement
