హైవే రోడ్డు.. ఒంటరిగా పరుగెడుతున్న చిన్నారి..!!

‘రోడ్డుపై వెళ్తున్నప్పుడు, వాహనం నడుపుతున్నప్పుడు ఒళ్లంతా కళ్లు చేసుకోవాలి’ అనే మాటకు ఓ మహిళా డ్రైవర్‌ అసలైన అర్థం చెప్పారు. మానవత్వానికి కాస్త అమ్మతనాన్ని జోడించి ఓ పసిప్రాణాన్ని కాపాడారు. గడ్డకట్టుకుపోయే చలిలో కాళ్లకు చెప్పులు లేకుండా.. ఒంటికి సరిపడా బట్టలు లేకుండా నడిరోడ్డుపై పరుగెడుతున్న ఓ 19 నెలల చిన్నారిని అక్కున చేర్చుకున్నారు. ఆ బస్‌ డ్రైవర్‌ రాక క్షణంకాలం ఆలస్యమైనా పాప ప్రాణాలకు ముప్పు వాటిల్లేదే. ఈ ఘటన విస్కాన్సిన్‌ రాష్ట్రంలోని మిల్‌వాకీ పట్టణంలో గత డిసెంబరు 22న జరిగింది.రోజు ఉదయం మిల్‌వాకీ ట్రాన్సిట్‌ సంస్థకు చెందిన మహిళా డ్రైవర్‌ ఇరేనా ఇవిక్‌ డ్యూటీ నిమిత్తం బస్‌లో వెళ్తుండగా రోడ్డు డివైడర్‌పైన ఒంటరిగా పరుగెడుతున్న ఓ చిన్నారి కంటపడింది. కాళ్లకు చెప్పులు, సరిపడా బట్టలు లేకుండా గడ్డకట్టుకుపోయే చలిలో ఉన్న ఆ చిన్నారిని చూసి ఆమె షాక్‌ తిన్నది. వెంటనే అప్రమత్తమైన ఇవిక్‌ వాహనాన్ని పక్కకు నిలిపి పరుగెత్తుకుంటూ వెళ్లి ఆ చిన్నారిని బస్‌లోకి తీసుకొచ్చింది. ఇదంతా క్షణాల్లో జరగడంతో బస్‌లో ఉన్న ప్యాసెంజర్‌ అయోమయానికి గురయ్యారు. చలికి వణుకుపట్టి బిక్కుబిక్కుమంటూ తనవారి కోసం ఏడుస్తున్న ఆ చిన్నారి ఒక స్వెటర్‌ వేసి.. తన ఒళ్లో కూర్చోబెట్టుకుంది.ఇవిక్‌ అప్పటికే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకుని పాపను తీసుకెళ్లారు. కాగా, చిన్నారి తల్లికి మానసిక రుగ్మత ఉన్నందునే పాప ఇంట్లోనుంచి రోడ్డుపైకి చేరిందని అధికారులు తెలిపారు. పాపను ఆమె తండ్రికి అప్పగించారు. అప్రమత్తంగా వ్యవహరించి చిన్నారిని కాపాడిన ఇవిక్‌కు గురువారం సన్మానం చేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top