పాము తలపై రెండు కిక్‌లు.. అంతే..! | Sakshi
Sakshi News home page

పాము తలపై రెండు కిక్‌లు.. అంతే..!

Published Sat, Mar 30 2019 12:30 PM

అంతెత్తున ఎగిరి..
అరిజోనా ఎడారిలో అధునాతన పరికరాలు, కెమెరాలతో మా ప్రయోగం సాగింది. ఇసుకలో కూడా అతి వేగంగా కదిలే అత్యంత ప్రమాదకరమైన సర్పం రాటిల్‌స్నేక్‌. వాటి బారినాకూడా ప్రాణాలు రక్షించుకుంటున్న కంగారూ ర్యాట్‌ ఆత్మరక్షణా యుక్తులు అద్భుతం. అందరూ అనుకుంటున్న అదృష్టం కొద్దీ అవి మత ప్రాణాలను నిలుపుకోవడం లేదు. విస్మయపరిచే ఆత్మరక్షాణ వ్యూహాలతోనే ఇది సాథ్యం. తాజా వీడియోలో.. ఎలుకను విందు చేసుకుందామనుకున్న పాము దానిమీదకి ఒక్క ఉదుటున దుమికింది. నోట కరుచుకున్నంత పని చేసింది. పాముకన్నా వేగంగా స్పందించిన ఎలుక అతెత్తున ఎగిరి గాల్లోకి ఎగిరింది. పాము నోట్లో చిక్కుకుంది అనుకునే సమయంలో నింజాఫైట్‌ చేసింది. పాము తలపై రెండు కాళ్లతో కిక్‌ చేసింది. మళ్లీ గాల్లోనే గింగిరాలు తిరుగుతూ.. దూరంగా పారిపోయింది.

మామాలుగా ఆ పరిస్థితుల్లో వేరే జాతికి చెందిన ఎలుకలుంటే వాటికి చావు తథ్యం అయ్యేదే.  ముందుగా తాము కూడా నమ్మలేదని తెలిపారు. స్లోమోషన్‌లో.. వాటి వేగాన్ని చూసి ఆశ్చర్యంలో మునిగామని తెలిపారు. ఈ వీడియోలో పాము చేతికి చిక్కి ఎలుక రెండు నింజా కిక్‌లు ఇచ్చి బయటపడిందని తెలిపారు. అది 100 మిల్లీ సెకండ్లలో బయటపడింది. మామూలుగా అయితే, రాటిల్‌స్నేక్‌ చాలా వేగంగా దెబ్బకొడతాయి. కానీ, కంగారూ మరింత వేగంగా తన యుక్తిని అమల్లో పెట్టింది.  అవి పరుగెత్తడానికి వీలు లేనప్పుడు నింజాఫైట్‌ ట్రిక్కులతో బయటపడతాయి. ఆత్మరక్షణ వ్యూహాలు. తప్పుకోవడంతో పాటు కిక్‌. మళ్లీ మళ్లీ జంప్‌ చేస్తూ పారిపోయింది. మనిషి కనురెప్పపాటు కాలం 150 మిల్లీ సెకండ్లు.

Advertisement
Advertisement