rattlesnake
-
న్యూజెర్సీలో అరుదైన రాటిల్ స్నేక్
వాషింగ్టన్: న్యూజెర్సీ అడవుల్లో అరుదైన రెండు తలల రాటిల్ స్నేక్ జన్మించింది. గత నెల 25న బర్లింగ్టన్ కౌంటీలోని హెర్పెటోలాజికల్ అసోసియేట్స్‌కు చెందిన ఇద్దరు ఉద్యుగులు ఈ అరుదైనన రాటిల్ స్నేక్ పిల్లను గుర్తించారు. దీని గురించి హెర్పెటోలాజికల్ అసోసియేట్స్ సీఈవో బాబ్ జప్పలోర్తి మాట్లాడుతూ.. ‘న్యూజెర్సీలో ఇలాంటి రెండు తలల రాటిల్ స్నేక్ కనిపించడం ఇదే ప్రథమం. కానీ ఇది ఎక్కువ రోజులు బతకలేదు. పాకే సమయంలో ఏదైనా వేటాడే జీవి కంట పడితే అది దీన్ని చంపేస్తుంది. అంతే కాక ఈ రాటిల్ స్నేక్కు రెండు తలలు ఉండటం మూలానా రెండు మెదళ్లు ఉంటాయి. దాంతో రెండు తలలు స్వతంత్రంగా ఆలోచిస్తాయి. అంటే ఒకే పాము విభిన్న ఆలోచనలన్న మాట. ఫలితంగా మెదడుతో మిగతా శరీరం సమన్వయం కాలేక దానిపై అదే దాడి చేసుకునే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఇలాంటి జీవులు ఎక్కువ రోజులు బతకలేవు’ అన్నారు. ఇలా రెండు తలల పాములు కనిపించడం చాలా అరుదు. కవల పిల్లలు పూర్తిగా విడిపోకుండా దేహాలు కలిసిపోయి తలలు మాత్రమే వేరుగా ఏర్పడినప్పుడు ఇలాంటి వింత రూపంతో జీవులు జన్మిస్తుంటాయి. మనిషి శరీరాన్ని నియంత్రించేది మెదడు. అలాంటి మెదళ్లు రెండు ఉండి.. మిగిలిన శరీరం అంతా ఒక్కటిగానే ఉంటే... ఏ మెదడు ఇచ్చిన సంకేతాలను మొదట అనుసరించాలో తెలియక శరీర భాగాలు తికమకపడే ప్రమాదం ఉంటుంది. ఒక తల ఇటు వెళితే.. ఇంకో తల అటు వెళ్లడానికి సిద్ధమవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఒక్క శరీరంతో రెండు తలలు ఇచ్చే సూచనలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లడం చాలా కష్టం. అలా చేయకపోతే అవి జీవించడం కూడా కష్టమవుతుంది. -
పాము తలపై రెండు కిక్‌లు.. అంతే..!
-
వైరల్ : అత్యంత విషపూరితం.. అయినా సురక్షితం..!
వాషింగ్టన్ : అమెరికా ఎడారుల్లో అత్యంత విషపూరితమైన రాటిల్‌స్నేక్ దాడుల నుంచి ప్రాణాలు నిలుపుకొంటున్న కంగారూ ర్యాట్ వ్యూహాలేమిటో తెలిసిపోయాయి. రాటిల్‌స్నేక్ నోటికి చిక్కినా కూడా సరికొత్త వ్యూహాలతో తప్పించుకుంటున్న ఈ ఎలుకల చాకచక్యాన్ని చూసి జంతు శాస్త్రవేత్తలే ఆశ్యర్యపోయారు. సెకన్లో ఏడో వంతు వేగంతో పాము తలపై ఎగిరి తంతున్న కంగారూ ర్యాట్ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అధునాతన కెమెరాలు, పరికరాలతో అరిజోనా ఎడారిలో శాస్త్రవేత్తలు ఓ పరిశోధన చేపట్టారు. అంతెత్తున ఎగిరి.. శాస్త్రవేత్త ఫ్రేమిలర్ ప్రకారం.. ఇసుకలో కూడా అతి వేగంగా కదిలే అత్యంత ప్రమాదకరమైన సర్పం రాటిల్‌స్నేక్. అయినా, వాటికి ఆహారం కాకుండా ఎస్కేప్ అవుతున్న కంగారూ ర్యాట్ ఆత్మరక్షణా యుక్తులు అద్భుతం. అందరూ అనుకుంటున్నట్టుగా ఇవి అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడటం లేదు. విస్మయపరిచే వ్యూహాలతో పాములకే సవాల్ విసురుతున్నాయి. తాజా వీడియోలో.. ఎలుకను విందు చేసుకుందామనుకున్న రాటిల్‌స్నేక్ దానిమీదకి ఒక్క ఉదుటున దుమికింది. నోట కరుచుకున్నంత పని చేసింది. అయితే, పాముకన్నా వేగంగా స్పందించిన ఎలుక అంతెత్తున గాల్లోకి ఎగిరింది. పాము నోట్లో చిక్కుకుంది అనుకునే సమయంలో నింజాఫైట్ చేసింది. దాని తలపై రెండు కాళ్లతో కిక్ చేసింది. మళ్లీ గాల్లోనే గింగిరాలు తిరుగుతూ.. పాముకు అందకుండా దూరంగా పారిపోయింది. ఆ పరిస్థితుల్లో వేరే జాతికి చెందిన ఎలుకలుంటే వాటికి చావు తథ్యం అయ్యేదే. మామూలుగా అయితే, రాటిల్‌స్నేక్ చాలా వేగంగా దెబ్బకొడతాయి. కానీ, కంగారూ ర్యాట్స్ మరింత వేగంగా స్పందింస్తాయి. ఈ ఎలుకలు పరుగెత్తడానికి వీలు లేనప్పుడు నింజాఫైట్ ట్రిక్కులతో బయటపడతాయి. అయితే, పాము విషం చిమ్మితే ఎలుక ప్రాణాలు ఉంటాయా అనే ఒక సందేహం కలుగుతోంది కదా.. వేగంగా స్పందించినప్పుడు సరిపడినంత విషం పాము కోరల్లోకి రాదు. ఆ క్రమంలో కంగారూ ర్యాట్స్ ఫైట్ చేసి తప్పించుకుంటాయి. ఎలుకలు 30 నుంచి 70 మిల్లీ సెకన్లపాటు పాము నోట్లో ఉన్నా కూడా వాటికి విషం చేరదు. అంటే మనిషి కనురెప్పపాటు కాలం (150 మిల్లీ సెకండ్లు) కన్నా తక్కువ సమయంలో ఎలుక యుద్ధం చేసి విజయం సాధిస్తుందన్నమాట..! -
ఈ వీడియో చూసేటప్పుడు గుండె జాగ్రత్త
-
ఈ వీడియో చూసేటప్పుడు గుండె జాగ్రత్త
లండన్: యూట్యూబ్‌లో ఇప్పుడు ఓ వీడియో హల్ చల్ చేస్తోంది. తన పైకి పాకిన ఎంతో విషపూరితమైన కట్లపాము నుంచి ఒక వ్యక్తి ఎలా బయటపడ్డాడో చూపించేదే ఆ వీడియో. ఈ వీడియోను హెడ్‌ఫోన్ పెట్టుకొని చూసే సమయంలో కచ్చితంగా ఓ చేత్తో గుండెను అదిమిపట్టుకోవాల్సిందే. దీనిని తదేకంగా చూస్తూ శ్వాసను కూడా మర్చిపోయే ప్రమాదం ఉంది. ఒక పాము, ఓ యువకుడికి మధ్య అంత టెన్షన్ పూరిత పరిస్థితి ఆ వీడియోలో ఉంది. నిక్ బిషప్ అనే యువకుడు ని ది రాంగ్లర్ పేరిట అటవీ జంతువులపై, పాములపై డాక్యుమెంటరీ తీసేందుకు అమెరికాలోని ఓ అడవి ప్రాంతంలో పర్యటిస్తున్నాడు. అలా వెళుతూ ఓ చోట కూర్చోగా అతడి పక్కనే ఓ పెద్ద కట్ల పాము ఉంది. అది చూసి అతడి గుండె ఎగిసిపడింది. కొంచెం కదిలినా అది కరిచే ప్రమాదం ఉంది. దీంతో దానిని చిన్న కర్రపుల్ల తీసుకొని తొలుత తోకపై తాకించగా అది సర్రుమంటి మీదకు పాకింది. దీంతో అతడి గుండెదడ మరింత పెరిగింది. ఆ వెంటనే మరోసారి దాని నడుము భాగంలో తాకించి దానిని దారి మళ్లించి చాకచక్యంగా బయటపడి బతికిపోయాన్రా దేవుడా అనుకున్నాడు. ఈ వీడియోను దాదాపు 67లక్షలమంది చూశారు. -
పాముతో పోరాడి బాలికను కాపాడిన కుక్క
టంపా: ప్రమాదకరమైన తాచుపాము నుంచి ఏడేళ్ల అమ్మాయిని రక్షించి జర్మన్ షెపర్డ్ జాతి కుక్క 'హాస్' సూపర్ హీరోగా మారింది. బాలికను కాపాడేక్రమంలో పాముతో పోరాడి గాయపడింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈ కుక్క కోలుకోవాలని ఎంతోమంది కోరుకుంటున్నారు. అమెరికాలోని ఫ్లోరిడా స్టేట్‌లో టంపా నగరంలో ఈ ఘటన జరిగింది. టంపాలో ఆడమ్ డిలుకా ఇంటి పెరట్లో ఏడేళ్ల బాలిక ఆడుకుంటోంది. ఇంతలో ఓ తాచుపాము ఆ అమ్మాయి దగ్గరకు వచ్చింది. కుక్క అమ్మాయిని కాపాడేందుకు వెంటనే ముందుకు దూకింది. తాచుపాము నుంచి అమ్మాయి ప్రాణాలు కాపాడేందుకు పోరాడింది. పాము మూడుసార్లు కాటేసిన కుక్క వెనక్కితగ్గలేదు. చివరకు కుక్క దెబ్బకు పాము అక్కడి నుంచి వెళ్లిపోయంది. బాలికను సురక్షితంగా కాపాడింది కానీ పాముతో పోరాడే క్రమంలో కుక్క తీవ్రంగా గాయపడింది. ఇంటిపైన ఉన్న బాలిక నానమ్మ మోలీ డిలుకా కుక్క అరుపులు విని కిందికు వచ్చింది. కుక్కకు రక్తస్రావంకావడాన్ని గమనించింది. కుక్కకాలిపై ఉన్న గాయాలను పరిశీలించిన మోలీ అవి పాముకాట్లుగా గుర్తించింది. టంపా ఎమర్జెన్సీ వెటర్నరీ, స్పెషాల్టీ ఆస్పత్రి ఐసీయూలో ప్రస్తుతం కుక్క చికిత్స పొందుతోంది. పాము కాటు వల్ల కుక్క కిడ్నీ పాడైంది. కుక్కకు ప్రాణాపాయం తప్పినా చికిత్సకు భారీగా ఖర్చు అవుతోంది. రోజుకు 67 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతోంది. కుక్కను ఆదుకునేందుకు డిలుకా ఫ్యామిలీ ఫ్రెండ్ విరాళాలు కోరగా వందలాదిమంది స్పందించారు. కుక్క వైద్యానికి మొత్తం 10 లక్షల రూపాయలు అవసరం అవుతుందని భావించగా, దాదాపు 24 లక్షల రూపాయలు పోగయ్యాయి. వైద్యానికి అయ్యే డబ్బు పోను మిగిలినదాన్ని ఓ స్వచ్ఛంద సంస్థకు అందజేయనున్నారు. కుక్క పూర్తిగా కోలుకుంటుందని వైద్యులు చెప్పారు. డిలుకా కుటుంబం ఈ ప్రమాదం జరగడానికి నెల రోజుల ముందే ఈ కుక్కను తీసుకున్నారు. ఇది తమ కుటుంబాన్ని కాపాడిందని డిలుకా ప్రశంసించాడు. -
స్నేక్‌తో సెల్ఫీలొద్దురో...!
'సింహం పడుకుంది కదాని చెప్పి జూలుతో జడేయకూడదురా! అలాగే పులి పలకరించింది కదా అని పక్కన నిలబడి ఫోటో తీయించుకోకూడదురోయ్...'ఓ సినిమాలో పవన్ కల్యాణ్ పంచ్ డైలాగ్ ఇది. పాపం... అమెరికన్లు ఇది వినే చాన్స్ లేదుగా! అందుకే కాలిఫోర్నియా రాష్ట్రంలోని లేక్ ఎల్సినోర్కు చెందిన అలెక్స్ గోమెజ్ (36) తన వ్యవసాయక్షేత్రంలో ఓ తాచుపాము కనపడగానే చాకచాక్యంగా పట్టేశాడు. దాన్ని దూరంగా వదిలేస్తే సమస్యే ఉండేది కాదు. బహుశా సోషల్ మీడియాలో పోస్ట్ చేద్దామని కాబోలు ... స్నేక్‌తో సెల్ఫీ దిగే ప్రయత్నం చేశాడు. తాచు ఊరుకుంటుందా... అదును చూసి కసుక్కున కాటేసింది. గోమెజ్ లబోదిబోమంటూ ఆస్ప్రతికి పరుగెత్తాడు. చెయ్యి తీసేసే ప్రమాదం కూడా ఉందట. జూలైలోనే కాలిఫోర్నియాలో టాడ్ ఫాస్లర్ అనే మహానుభావుడు ఇలాంటి సెల్ఫీ ప్రయత్నమే చేయగా... చేతిపై పాము కాటేసింది. చెయ్యి పూర్తిగా నీలం రంగులోకి మారిపోవడంతో ఫాస్లర్కు ఏకంగా కోటి రూపాయల పైచిలుకు ఆసుపత్రి బిల్లు అయ్యిందట.