బీచ్‌లో కూతురితో సందడి చేసిన ధోని | Video Of MS Dhoni And Ziva Playing In The Sand | Sakshi
Sakshi News home page

బీచ్‌లో కూతురితో సందడి చేసిన ధోని

Dec 31 2018 1:44 PM | Updated on Mar 22 2024 11:16 AM

ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌లో టీమిండియా బిజీగా ఉంటే... మాజీ కెప్టెన్‌, మిస్టర్ కూల్ ఎంఎస్‌ ధోని మాత్రం భారత్‌లో ఎంజాయ్‌ చేస్తున్నాడు. మరో 10 రోజుల తరువాత వన్డేలు, టీ20లు ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లనున్న ధోని.. తాజాగా చెన్నై బీచ్‌లో సందడి చేశాడు. తన కుటుంబంతో సహా వచ్చిన ధోని.. కూతురు జీవాతో కలిసి మెరీనా బీచ్‌లో కనిపించి, అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అంతే కాకుండా అక్కడి ఇసుకలో గూళ్లు కట్టాడు. సొరంగం లాంటి గొయ్యి తీయడమే కాకుండాఅందులోకి తన కూతురిని దింపాడు.  ఆ క్షణంలో తను కూడా చిన్న పిల్లాడిలా మారిపోయి బీచ్‌లో కూతురితో కలిసి ధోని ఆడుకోవడం అక్కడున్నవారిని ఆశ్చర్యపరిచింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement