భారత ప్రధాన న్యాయమూర్తిపై అభిశంసన విషయమై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభలో తీర్మానం కోరుతూ కాంగ్రెస్ సహా ఏడు విపక్ష పార్టీలు ఇచ్చిన అభిశంసన నోటీసులను ఆయన తిరస్కరించారు. న్యాయనిపుణులతో చర్చల అనంతరం వెంకయ్య ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని సోమవారం ఉపరాష్ట్రపతి కార్యాలయం ఒక ప్రకటన విడుదలచేసింది.