కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అహ్మద్‌నగర్‌లోని మహాత్మాపూలే వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శుక్రవారం జరిగిన స్నాతకోత్సవంలో గడ్కరీ పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న గడ్కరీ సభను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం జాతీయగీతం ఆలపిస్తున్న సమయంలో ఆయన సొమ్మసిల్లారు.