ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ టీడీపీ నేతల అరాచకాలు పెచ్చుమీరుతున్నాయి. సమస్యలపై నిలదీశారనే అసహనంతో పశ్చిమగోదావరి జిల్లాలోని ఉంగుటూరు నియోజకవర్గం పరిధిలోని పెదలింగంపాడు గ్రామంలో దళిత యువకులపై టీడీపీ అభ్యర్థి గన్ని వీరాంజనేయులు వర్గీయులు దాడికి దిగారు. ఈ ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఐదేళ్లుగా ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు తమ గ్రామాన్ని పట్టించుకోలేదని, రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించలేదంటూ పెదలింగంపాడు దళితులు వినతిపత్రమిస్తుండగా ఆయన కాన్వాయ్ వెంట వచ్చిన అనుచరులు వారిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. దళిత యువకులపై పిడిగుద్దులు కురిపించారు. వారిని చితకబాదారు.