తల్లిదండ్రుల జాడకోసం ఓ పదకొండేళ్ల చిన్నారి పడుతున్న ఆవేదన మనసుల్ని కలచివేస్తోంది. సరైన ఇమ్మిగ్రేషన్ పత్రాలు లేకుండా నివసిస్తున్నారనే కారణంతో మిస్సిస్సిపిలోని ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్‌పై ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు బుధవారం దాడి చేశారు. అందులో పనిచేస్తున్న వందలాది మందిని అరెస్టు చేశారు. పాఠశాలకు వెళ్లిన తమ చిన్నారులు ఆందోళనకు గురవుతారని, వారిని కూడా తమతో తీసుకెళ్లండని మొరపెట్టుకున్నా వినలేదు.