ఆంధ్రప్రదేశ్ పునఃవ్యవస్థీకరణ బిల్లు -2014ను పార్లమెంటు భయంకరంగా ఉన్న సమయంలో పాస్ చేశారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. తలుపులు మూసేసి బిల్లును ఆమోదించిన రోజున బీజేపీ నేతలూ సభలో ఉన్నారని, ప్రస్తుత స్పీకర్ సుమిత్రా మహాజన్ కూడా అంతా చూశారని చెప్పారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేస్తామని చెప్పిన బీజేపీ ఇప్పుడు ముఖం చాటేస్తోందని అన్నారు.