ఎఫ్‌ఆర్వో అనితపై దాడికి తెగబడ్డ ఘటనలో ఎమ్మెల్యే సోదరుడు కోనేరు కృష్ణ సహా 16మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిపై 147,148, 207,332,353,427 సెక్షన్ల కింద ఈజ్గామ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. కాగా దాడిలో గాయపడ్డ మహిళా అధికారిణి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘కోనేరు కృష్ణ మొదటగా నాపై దాడికి పాల్పడ్డారు. తర్వాత మరో 10మంది కోనేరు కృష్ణ అనుచరులు కర్రలతో నా తలపై కొట్టారు. ఆ క్షణంలో నేను బతుకుతానని అనుకోలేదు.’ అని ఆవేదన వ్యక్తం చేశారు.