ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం గవర్నర్ బిశ్వమోహన్ హరిచందన్‌ను మర్వాదపూర్వకంగా కలిశారు. మరోవైపు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పనితీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆశించిన రీతిలో ఏసీబీ పనితీరు కనిపించడం లేదంటూ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా కార్మిక చట్టాలను మోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ధ్వజమెత్తారు. జనవరి 8న కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త బంద్ చేపడుతున్నామని వెల్లడించారు. ఇక తెలంగాణా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)కు సంబంధించిన లోగోను, వెబ్‌సైట్‌ను గురువారం ప్రారంభించారు. ఏఐ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రజలకు సేవలను మరింత సులభతరం చేస్తున్నట్టు వెల్లడించారు.
ఈనాటి ముఖ్యాంశాలు
Jan 2 2020 7:48 PM | Updated on Mar 21 2024 8:24 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement