ఈనాటి ముఖ్యాంశాలు | today news round up 1st January 2020 Farmers Happy With YS Jagan Govt, Says MVS Nagireddy | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Jan 1 2020 7:26 PM | Updated on Mar 21 2024 8:24 PM

నూతన సంవత్సరం సందర్భంగా ముఖ‍్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి టీటీడీ అర్చకులు ఆశీర్వచనాలు అందించారు. తాడేపల్లిలోని నివాసంలో ముఖ్యమంత్రికి  వేదపండితులు ఆశీర్వచనాలు ఇచ్చి శ్రీవారి తీర్ధప్రసాదాలు, శేష వస్త్రాలను అందచేశారు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఏపీఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేసింది. ఇక చైనాతో సరిహద్దు సమస్యలకు త్వరలోనే శాశ్వత సానుకూల పరిష్కారం లభిస్తుందని నూతన ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ముకుంద్‌ నరవనే ఆశాభావం వ్యక్తం చేశారు.మరోవైపు  నూతన సంవత్సర వేడుకలు ఆ ఇంట విషాదాన్ని నింపింది. ప్రమాదవశాత్తూ లిఫ్ట్‌ కూలిన ఘటనలో ప్రముఖ వ్యాపారవేత్త పునీత్‌ అగర్వాల్‌, ఆయన కుమార్తెతో పాటు మరో నలుగురు దుర్మరణం చెందారు. 

Advertisement
 
Advertisement
Advertisement