చిన్నపిల్లలు సార్‌.. వదిలేయండి | Thoothukudi Anti Sterlite Protests- video goes viral | Sakshi
Sakshi News home page

చిన్నపిల్లలు సార్‌.. వదిలేయండి

May 25 2018 8:11 AM | Updated on Mar 21 2024 8:29 PM

తూత్తుకుడి హింసపై నేడు(శుక్రవారం) తమిళనాడు బంద్‌కు ప్రతిపక్షాలు పిలుపునిచ్చాయి. స్టెరిలైట్‌ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా స్థానికులు చేపట్టిన ఆందోళన పోలీసుల కాల్పులతో హింసాత్మకంగా మారింది. మొత్తం 13 మంది మరణించినట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. పైగా ముఖ్యమంత్రి పళనిస్వామి, ఆందోళనకారులపై పోలీసుల దమనకాండను సమర్థిస్తూ ప్రకటన చేయటం ప్రతిపక్షాల్లో ఆగ్రహన్ని తెప్పించింది. మరోవైపు లాఠీఛార్జీ సమయంలో కొందరు రిపోర్టర్లు చేసిన లైవ్‌ రిపోర్టింగ్‌  వీడియో సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. చిన్న పిల్లలను అని కూడా చితకబాదటంతో ఓ రిపోర్టర్‌ అడ్డుకున్నారు. లైవ్‌ కవరేజ్‌ చేస్తున్న ఆ రిపోర్టర్‌కు, పోలీసులకు మధ్య జరిగిన సంభాషణ ఇలా ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement