విగ్రహాల తొలగింపు.. ఏలూరులో ఉద్రిక్తత | Tension at Eluru over Demolition of Ramalayam temple | Sakshi
Sakshi News home page

విగ్రహాల తొలగింపు.. ఏలూరులో ఉద్రిక్తత

May 6 2019 9:03 AM | Updated on Mar 22 2024 10:40 AM

అర్ధరాత్రి సమయంలో ఆలయంలో విగ్రహాలను తొలగించడంతో పగోజిల్లా ఏలూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏలూరులోని అంబికా థియేటర్ పక్కన ఓ సంస్థ యజమానులు మల్టిఫ్లెక్స్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపడుతున్నారు. పక్కనే ఉన్న వంద సంవత్సరాల చరిత్ర కలిగిన రామాలయంలో విగ్రహాలను తొలగించి, గుడి కూలగొట్టే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు భారీ సంఖ్యలో చేరుకుని ఆందోళనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement