ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో పురుడుపోసుకున్న తెలంగాణ జన సమితి(టీజేఎస్) ఆవిర్భావ సభ ఆదివారం హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో జరగనుంది. దీనికి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించేందుకు నేతలు కసరత్తు చేశారు. సభా వేదికపై 1000 మంది ఆసీనులు కానున్నారు. ఒకే వరుసలో కనీసం 200 మంది కూర్చోవడానికి వీలుగా ఐదు వరుసల్లో స్టేజీ నిర్మాణం జరుగుతోంది. ముందు వరుసలో ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, శాతవాహన సహా రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు చెందిన సుమారు 200 మంది విద్యార్థులు కూర్చుంటారు.