యాదాద్రిభువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో శుక్రవారం వెలుగుచూసిన శ్రావణి హత్య ఉదంతం మరవక ముందే సోమవారం మనీషా అనే యువతి హత్యకుగురైన విషయం వెలుగులోకి వచ్చింది. హర్రర్ సినిమాను తలపించే రీతిలో ఒకే తరహాలో వెలుగుచూస్తున్న వరుస హత్యలు రాష్ట్రంలో సంచలనం రేపుతున్నాయి.