ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 విక్రమ్ ల్యాండర్ ఆచూకీ కోసం నాసా ప్రయత్నించి చివరకు దాని ఆచూకీ కనిపెట్టింది. దీన్ని గుర్తించడంలో చెన్నైకి చెందిన ఓ ఇంజినీర్, ఖగోళ శాస్త్రవేత్త షణ్ముగ సుబ్రమణియన్ కీలక పాత్ర పోషించినట్లు నాసా చెప్పింది. దీంతో నాసా అతనిపై ప్రశంసలు కురిపించింది. దీనిపై షణ్ముగ స్పందిస్తూ.. ఓ సాధారణ పిక్ నుంచే తాను ల్యాండర్ కూలిన ప్రాంతాన్ని గుర్తించగలినట్లు షణ్ముగ చెప్పాడు. నాసా విడుదల చేసిన రెండు ఫోటోల్లో ఉన్న తేడాల ఆధారంగానే ఆ ప్రాంతాన్ని గుర్తించినట్లు తెలిపాడు. లూనార్ ఆర్బిటార్ తీసిన ఫోటోలను నాలుగైదు రోజుల పాటు కనీసం 7 నుంచి 8 గంటలు స్కాన్ చేసినట్లు చెప్పాడు. అయితే తాను కనుగొన్న విషయాన్ని నాసా ద్రువీకరించడం సంతోషంగా ఉందన్నాడు. ఒక రకంగా తన శోధన అనేక మందికి ప్రేరణగా నిలుస్తుందని షణ్ముగ తెలిపాడు.
విక్రమ్‌ల్యాండర్ ఆచూకీ కనుగొన్నది మనోడే!
Dec 3 2019 5:03 PM | Updated on Dec 3 2019 5:08 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement