ఏపీలో టీడీపీ నాయకుల దౌర్జన్యాలు రోజురోజుకి శృతిమించిపోతున్నాయి. వారికి ఎవరైనా అడ్డుచెప్పినా, ఎదురుతిరిగినా, ప్రశ్నించినా దాడికి దిగటం టీడీపీ నాయకులకు సర్వసాధారణంగా మారింది. తాజాగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఏకంగా పోలీసులపై దౌర్జన్యానికి దిగారు. ఏలూరు టౌన్ హాల్‌లో లక్షల రూపాయల్లో జూదం ఆడుతున్నారని పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేశారు. దీంతో చిర్రెత్తుకుపోయిన బడేటి బాబ్జి హాల్ వద్దకు చేరుకుని పోలీసులపై విరుచకుపడ్డారు.