మండలంలో టీడీపీ నాయకుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. వివాహేతర సంబంధం వ్యవహారంపై కొప్పవరంలో టీడీపీకి చెందిన రెండు వర్గాల మధ్య శుక్రవారం మధ్యాహ్నం ఘర్షణ చోటుచేసుకుంది. టీడీపీ నేతలు వెంకట్రామిరెడ్డి, సర్రెడ్డి వర్గీయులు నడిరోడ్డుపై బాహాబాహీకి దిగారు. వివాహేతర సంబంధంలో సెటిల్‌మెంట్ బెడిసికొట్టడంతో ఈ గొడవ జరిగినట్టు తెలుస్తోంది