మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పాదయాత్రలో భాగంగా విశాఖ జిల్లా వేచలంలో ఉన్న వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన తన అనుచరులతో పాటు పార్టీలోకి వచ్చారు. పార్టీ కండువాతో వీరిని వైఎస్ జగన్ సాదరంగా ఆహ్వానించారు. భారీ సంఖ్యలో ఆనం మద్దతుదారులు వైఎస్సార్ సీపీలో చేరడంతో ఇక్కడ పండగ వాతావరణం నెలకొంది.