సాక్షి, సూర్యాపేట: ప్రమాదవశాత్తూ నాగార్జున సాగర్ ఎడుమ కాల్వలో దూసుకుపోయిన స్కార్పియో వాహనాన్ని ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది ఎనిమిది గంటల పాటు శ్రమించి శనివారం మధ్యాహ్నం వెలికితీశారు. కోదాడ నియోజకవర్గం నడిగూడెం మండలంలోని చాకిరాల వద్ద స్కార్పియో వాహహం అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే. కాగా వెలికితీసిన వాహనంలోనే ఆరు మృతదేహాలు కూడా ఉండటంతో కుటుంబసభ్యులు ఒక్కసారిగా భోరున విలపించారు. దాంతో ఘటనా స్థలంలో తీవ్ర విషాదం నెలకొంది.