కన్నేసిన ఉగ్ర సంస్థ ఐసిస్‌ | Sri Lanka Attack Carried Out by ISIS | Sakshi
Sakshi News home page

కన్నేసిన ఉగ్ర సంస్థ ఐసిస్‌

Apr 22 2019 7:06 AM | Updated on Apr 22 2019 7:19 AM

లష్కరేతోయిబా, తాలిబన్, అల్‌ కాయిదా.. కరుడుగట్టిన ఈ ఉగ్రవాద సంస్థల్ని తలదన్నేలా ప్రపంచ దేశాలకు సవాల్‌ విసురుతున్న సంస్థే ఐసిస్‌. ఇస్లామిక్‌ స్టేట్‌ ఇన్‌ ఇరాక్‌ అండ్‌ సిరియా (ఐఎస్‌ఐఎస్‌), ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌) అనే పేర్లతో ప్రారంభమైన దీని ప్రస్థానం ప్రస్తుతం ఖండాలు, ప్రాంతాల వారీగా ప్రత్యేక విభాగాలతో విస్తరించింది. ఇరాక్, సిరియాల్లో షియాల ఆధిపత్యానికి గండికొడుతూ సున్నీల ప్రాబల్యం పెంచుతూ ఇస్లామిక్‌ రాజ్య స్థాపనే ధ్యేయంగా ఐసిస్‌ ఏర్పడింది. ఇరాక్, సిరియాల్లో ఉన్న సున్నీ ప్రాంతాలను కలిపి ఓ రాజ్యంగా ఏర్పాటు చేయాలన్నది దీని తొలినాటి లక్ష్యం.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement