ఎవరినీ విడిచిపెట్టలేదు. ఆమె కన్నుగీటితే.. ఎవరూ మాత్రం సిగ్గుపడకుండా ఉంటారు. ఎవరు మాత్రం ముసిముసి నవ్వులు నవ్వకుండా ఉంటారు. ఎవరు మాత్రం ఆమె కనుసైగల సెగలు తగలకుండా రాతిబొమ్మలుగా ఉండిపోగలరు. అందుకే మన నెటిజన్లు తమ క్రియేటివిటీకి పదును పెట్టారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదలు రాహుల్ గాంధీ వరకు.. అటు సినీ రంగంలో రజనీ మొదలు రానా వరకు అందరినీ ప్రియాప్రకాశ్ వారియర్ కనుసైగల వాలుచూపులో పరిధిలోకి తీసుకొచ్చారు. ఆమె కన్నుగీటితే.. వారు ఎలా స్పందిస్తారో చూపిస్తూ.. స్పూఫ్ వీడియోలు వదిలారు. ఇప్పుడు ఈ వీడియోలు విపరీతంగా హల్‌చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రియా కన్నుగీటితే.. బ్రహ్మచారి రాహుల్‌గాంధీ ముసిముసి నవ్వులు రువ్వుతూ.. లోలోపల సిగ్గుపడుతున్నట్టు ఉన్న స్పూఫ్ నెటిజన్లను తెగ అలరిస్తోంది.