సినిమాలు, షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీకి కూడా సమయం కేటాయిస్తూ ఉంటాడు యంగ్ హీరో అల్లు అర్జున్. ఏ మాత్రం గ్యాప్ దొరికినా ఫ్యామిలీతో ఉండేందుకే ఇష్టపడే బన్నీ తన చిన్నారులతో కలిసి అల్లరి చేస్తుంటాడు. బన్నీ పిల్లలతో చేసే అల్లరి ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా పేజ్ లో షేర్ చేస్తుంటుంది అల్లు అర్జున్ భార్య స్నేహ. తాజాగా స్నేహ పోస్ట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.