ఇటీవల వరుస వివాదాలతో హల్‌చల్ చేస్తున్న టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్లగణేష్, అతని సోదరుడు శివబాబులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌కు చెందిన డాక్టర్ దిలీప్ చంద్రకు భూమిని కొనుగోలు చేసేందుకు బండ్ల గణేష్ గతంలో ఒప్పందం చేసుకున్నారు. ఫరూఖ్ నగర్ మండలం, బూర్గుల శివారులో ఉన్న ఈ పౌల్ట్రీ ఫామ్‌లను ఒప్పందం ప్రకారం బ్యాంకు రుణాలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.