ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతన్నలకు మరో వరం ప్రకటించారు. మంగళవారం రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం వైఎస్ జగన్.. రైతుల పట్ల తనకు ఉన్న చిత్తశుద్ధిని మరోసారి చాటుకున్నారు. రైతు భరోసా పథకం కింద రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయాన్ని రూ. 12,500 నుంచి రూ. 13,500కు పెంచుతున్నట్టు సీఎం వైఎస్ జగన్ తెలిపారు. రైతు భరోసా అమలును నాలుగేళ్ల నుంచి ఐదేళ్లకు పెంచారు. దీంతో ఐదేళ్లలో రైతు భరోసా కింద రూ. 67,500 పెట్టుబడి సాయం రైతులకు అందనుంది.