పీఎస్‌లో ఆర్టీసీ విజిలెన్స్‌ డీఎస్పీ లొంగుబాటు | RTC Vigilance DSP Ravibabu surrender in chodavaram police station | Sakshi
Sakshi News home page

పీఎస్‌లో ఆర్టీసీ విజిలెన్స్‌ డీఎస్పీ లొంగుబాటు

Oct 20 2017 11:38 AM | Updated on Mar 20 2024 12:00 PM

రౌడీ షీటర్‌ గేదెల రాజు హత్యకేసులో ప్రధాన నిందితుడు, ఆర్టీసీ విజిలెన్స్‌ డీఎస్పీ రవిబాబు ఎట్టకేలకు గురువారం తెల్లవారుజామున చోడవరం పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయారు. అనంతరం ఆయనను విశాఖ తరలిస్తున్నారు. ఈ నెల 6వ తేదీన జరిగిన గేదెల రాజు హత్య కేసులో ఏ1 నిందితుడు, డీఎస్పీ దాసరి రవిబాబు, ఏ2 నిందితుడు క్షత్రియభేరి దినపత్రిక ఎండీ భూపతిరాజు శ్రీనివాసరాజు ఉన్నారు. అయితే గేదెల రాజు హత్య జరిగిన మరుసటి రోజు నుంచే ప్రధాన నిందితులిద్దరూ పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు కేసును పక్కదోవ పట్టించేందుకు రవిబాబు తన సర్వశక్తులు ఒడ్డుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అత్యున్నత స్థాయిలోనే పైరవీలు సాగిస్తున్నట్లు వినికిడి.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement