ఈనెల 13 నుంచి సమ్మెబాట పట్టనున్న ఆర్టీసీ కార్మిక సంఘాలను ఉద్దేశిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశం తొలి కేబినెట్ సమావేశంలోనే చర్చకు వస్తుందని పేర్కొన్నారు. అలాంటప్పుడు సమ్మె ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడే అధికారంలోకి వచ్చిన నాయకుడికి కొంత సమయం ఇవ్వాలని కోరారు. కానీ కొన్ని యూనియన్‌లు కార్మికులను మభ్యపెడుతూ.. పరిస్థితులను క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఆర్టీసీ సమ్మెకు ఏ కార్మికుడు మద్దతు ఇచ్చే పరిస్థితి లేదని ఆయన స్పష్టం చేశారు.