69వ గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి రామనాధ్ కోవింద్ భావోద్వేగానికి లోనయ్యారు. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన రాష్ట్రపతి అవార్డుల ప్రదానం సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఉగ్రవాదులతో పోరులో అసువులు బాసిన కార్పొరల్ ‘జ్యోతి ప్రకాష్ నిరాలా’కు ప్రకటించిన అశోక్ చక్ర అవార్డును అందించిన అనంతరం ఆయన కొద్దిసేపు ఉద్వేగానికి లోనయ్యారు. దీంతో అక్కడ వాతావరణం మరింత గంభీరంగా మారిపోయింది. అమరుడు జ్యోతి ప్రకాష్ తరపున ఆయన భార్య సుష్మానంద్ రాష్ట్రపతి చేతుల మీదుగా అశోక్ చక్ర శౌర్య పతకాన్ని అందుకున్నారు. ఆమె వెంట జ్యోతి ప్రకాష్ తల్లి మాలతీదేవి కూడా ఉన్నారు.