తమ కాలేజీలో చదివిన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతుండటం చాలా సంతోషంగా ఉందని ప్రగతి మహావిద్యాలయ యాజమాన్యం పేర్కొంది. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్నేహితులు బొగ్గులకుంటలోని ప్రగతి మహావిద్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి 1991 నుండి 1994 మధ్య ప్రగతి మహావిద్యాలయంలో డిగ్రీ పూర్తి చేశారు. వైఎస్ జగన్ బీకామ్‌లో ప్రథమ స్థానంలో రాణించారని కాలేజ్ ప్రిన్సిపల్ తెలిపారు.