మేనిఫెస్టోలు ప్రకటించని పార్టీలు

ఓట్ల పండుగ రానే వస్తోంది... కానీ ప్రధాన రాజకీయ పార్టీల సీట్ల పంచాయితీ మాత్రం తెగకపోవడంతో రానున్న ఎన్నికల్లో తమను గెలిపిస్తే ప్రజలకు ఏం చేస్తామన్నది మాత్రం అధికారికంగా వెల్లడి చేయడం లేదు. పోలింగ్‌కు మరో 18 రోజులు మాత్రమే గడువున్న నేపథ్యంలో ఇప్పటివరకు ఒక్క రాజకీయ పార్టీ కూడా అధికారికంగా తమ మేనిఫెస్టోను విడుదల చేయకపోవడం గమనార్హం. సీట్లు, టికెట్ల గొడవలతోనే రాజకీయ పక్షాలు కాలం వెళ్లదీస్తుండగా, ఈ ఎన్నికల్లో ఫలానా పార్టీకి ఓటేస్తే తమకు ఏం ఒరుగుతుందనేది సామాన్య ప్రజలకు అంతుబట్టడం లేదు. టీఆర్‌ఎస్‌ కేవలం పాక్షిక మేనిఫెస్టో విడుదల చేయగా, మిగిలిన పార్టీలు ఇంకా కసరత్తు దశలోనే ఉండిపోయాయి. కాంగ్రెస్‌ కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితం కాగా, ఇతర పార్టీలూ అడపాదడపా అది చేస్తాం... ఇది చేస్తామంటూ చెప్పడం.. అప్పుడప్పుడూ మీడియా కు లీకులివ్వడంతోనే సరిపెడుతున్నాయి. పోలింగ్‌కు సమయం సమీపిస్తున్నా రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలను ప్రకటించడంలో జాప్యం చేస్తుండటంపై రాజకీయ వర్గాల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  
 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top