సీఐ వెంకటేశ్వర్లును ట్రేస్‌ చేశాం | police traced CI Venkateswarlu says IG Stephen Ravindra | Sakshi
Sakshi News home page

సీఐ వెంకటేశ్వర్లును ట్రేస్‌ చేశాం

Feb 3 2018 12:24 PM | Updated on Mar 21 2024 7:52 PM

రెండు రోజులుగా కనిపించకుండాపోయిన నల్లగొండ టూటౌన్‌ సీఐ వెంకటేశ్వర్లు జాడను కనిపెట్టామని ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర చెప్పారు. సర్వీస్‌ రివాల్వర్‌, సిమ్‌కార్డులను తిరిగిచ్చేసి అదృశ్యమైన సీఐ.. గుంటూరు జిల్లా బాపట్లలోని ఓ రిసార్ట్స్‌లో మారుపేరుతో ఉన్నట్లు గుర్తించామని, ఇవాళే నల్లగొండ హెడ్‌ క్వార్టర్స్‌కు తీసుకొస్తామని తెలిపారు. గాలింపు కోసం ఏర్పాటైన ప్రత్యేక పోలీసు బృందం ఇప్పటికే ఇప్పటికే అతనిని కలుసుకున్నట్లు తెలిసింది. అటు వెంకటేశ్వర్లు కుటుంబం కూడా నల్లగొండకు బయలుదేరినట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement