ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. శనివారం నుంచి హస్తినాపూర్‌లో తన నివాసంలో అశ్వత్థామరెడ్డి దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. గృహ నిర్బంధంలో ఉండి దీక్ష చేస్తున్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు బలవంతంగా అశ్వత్థామరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఆర్టీసీ జేఏసీ నేత రాజిరెడ్డి దీక్షను కూడా పోలీసులు భగ్నం చేశారు. ఎల్బీనగర్‌లోని రెడ్డి కాలనీలో ఆయన ఇంటి డోర్ పగలగొట్టి మరి అదుపులోకి తీసుకున్నారు. అశ్వత్థామరెడ్డిని బలవంతంగా ఇంట్లో నుంచి బయటకు తరలించే క్రమంలో పోలీసులను ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. దాంతో ఇరువర్గాల మద్య తోపులాట చోటుచేసుకుంది.
అశ్వత్థామరెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు
Nov 17 2019 5:23 PM | Updated on Nov 17 2019 5:52 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement