చింతమనేని వీడియో షేర్‌ చేశారంటూ.. | Police Arrest Dalit Leaders Over Chintamaneni Prabhakar Complaint | Sakshi
Sakshi News home page

చింతమనేని వీడియో షేర్‌ చేశారంటూ..

Feb 21 2019 12:37 PM | Updated on Mar 22 2024 10:49 AM

టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై కనీసం కేసు కూడా నమోదు చేయని పశ్చిమ పోలీసులు.. ఆయన తీరును నిరసించినందుకు దళితులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. దళితుల గురించి అసభ్య పదజాలం ఉపయోగిస్తూ చింతమనేని మాట్లాడిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారంటూ వైఎస్సార్‌ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, దళిత నేత కత్తుల రవి జైన్‌ను పెదపాడు పోలీసులు అరెస్టు చేశారు. దీంతో దళిత సంఘాలు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రవిని వెంటనే విడిచి పెట్టకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement