కరుణానిధికి ప్రధాని మోదీ నివాళి | PM Modi pays tribute to Karunanidhi at Rajaji Hall | Sakshi
Sakshi News home page

కరుణానిధికి ప్రధాని మోదీ నివాళి

Aug 8 2018 11:43 AM | Updated on Mar 20 2024 1:57 PM

దివంగత నేత, తమిళనాడు మాజీ సీఎం ఎంకే కరుణానిధి భౌతిక కాయానికి ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. బుధవారం ఉదయం చెన్నైకి చేరుకున్న ప్రధాని.. కాసేపటి క్రితం రాజాజీ హాల్‌కు వెళ్లి కలైంగర్‌ భౌతికా కాయానికి నివాళులర్పించారు. భావోద్వేగంతో ఉన్న కనిమొళి, స్టాలిన్‌లను ఈ సందర్భంగా మోదీ ఓదార్చారు. మరోవైపు ప్రధానితోపాటు రక్షణ శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ నివాళులర్పించిన వారిలో ఉన్నారు. మద్రాస్‌ హైకోర్టు తీర్పు నేపథ్యంలో సాయంత్రం నాలుగు గంటలకు కరుణానిధి అంతిమ యాత్ర ప్రారంభం కానున్నట్లు డీఎంకే వర్గాలు వెల్లడించాయి.

Advertisement
 
Advertisement
Advertisement